నిత్యావసర వస్తువులతో సినిమాని పోల్చడం సరికాదు!

Telugu Lo Computer
0


ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై  డైరెక్టర్  రామ్‌ గోపాల్‌వర్మ కూడా ఈ విషయంపై కామెంట్ చేశాడు. హైదరాబాద్‌లో రామ్‌గోపాల్‌వర్మ మీడియాతో మాట్లాడుతూ…. ” 'బాహుబలి'తో తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. మన సినిమాల కలెక్షన్స్ ని పెంచారు. వందల కోట్లతో తీసిన సినిమా, కోటి రూపాయలతో తీసిన సినిమా టికెట్‌ను ఒకే ధరకు అమ్మడం అన్యాయం. ఏ వస్తువును ఎంత ధరకు కొనాలన్నది కొనుగోలుదారుడు, అమ్మకందారుడికి మధ్య ఉండే అవగాహన, అభిరుచులు, స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. సినిమా టికెట్‌ ధరలు తక్కువగా ఉండటం వల్ల సినిమా బడ్జెట్‌లు, వాటి రేంజ్, వ్యాల్యూస్ పడిపోతాయి. నిత్యావసర వస్తువులతో సినిమాని పోల్చడం సరికాదు. ప్రేక్షకులపై భారం పెరుగుతుందనే ఆలోచనతో టికెట్ల రేట్లను తగ్గిస్తున్నామని  ప్రభుత్వం చెప్పడంలో అర్థంలేదు. టికెట్ల రేట్లను తగ్గిస్తే హీరోల పారితోషికాలు తగ్గవు. హీరోలు లేకపోతే సినిమాలు ఎవ్వరూ చూడరు. వాళ్ళు లేకపోతే సినిమాలు లేవు. హీరోలని చూడటానికే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు” అని ఆర్జీవీ అన్నారు .

Post a Comment

0Comments

Post a Comment (0)