కమల్‌హాసన్‌కు సర్కార్ నోటీసులు

Telugu Lo Computer
0


కమల్ హాసన్ ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత స్వల్ప ఆరోగ్య సమస్యలు రాగా హాస్పిటల్ కు వెళ్లారు. కరోనా పరీక్షలు కూడా నిర్వహించగా కమల్ కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. తాజాగా రెండు రోజుల క్రితమే కరోనా తగ్గి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కమల్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో పాటు తమిళ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా కూడా చేస్తున్నారు. కమల్ కి కరోనా రావడంతో సినిమా షూటింగ్స్ ని ఆపేసారు. బిగ్ బాస్ లో మాత్రం కమల్ ప్లేస్ లో రమ్యకృష్ణ హోస్ట్ చేసింది. తాజాగా కరోనా తగ్గి తిరిగి రావడంతో కమల్ హాసన్ వెంటనే బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో కమల్‌ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌ అయింది. కరోనా నుంచి కోలుకొని కనీసం గ్యాప్ ఇవ్వకుండా, క్వారెంటైన్ లో ఉండకుండా, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగానే బిగ్‌బాస్‌ షో షూటింగ్‌లో ఎలా పాల్గొంటారు? కరోనా నిబంధనలు పాటించకుండా షూటింగ్‌ ఎలా చేస్తారు అంటూ కమల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు సర్కార్‌. దీనివల్ల మిగతా వారికీ ప్రమాదం ఏర్పడుతుందని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలా బాధ్యతా రాహిత్యంగాన ప్రవర్తిస్తే ఎలా అంటూ ప్రశ్నించింది. ఈ చర్యపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి కమల్ హాసన్ కు తమిళనాడు ప‍్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)