రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 December 2021

రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు !


కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైంగా పేరొందిన లిక్కర్‌ విజయమాల్యా ప్రస్తుతం గడ్డు రోజులు ఎదుర్కొంటున్నాడు. కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌తో దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానిన ఆయన చివరకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం చేసిన అప్పులతో దివాలా తీశారు. చివరకు బ్యాంకులకు అప్పులు చెల్లించలేక లండన్‌లో తలదాచుకుంటున్నారు. అయితే మాల్యా ఎలా ఉన్నా ? ఎక్కడ ఉన్నా ఆయనకు సంబంధించిన విషయాలపై ఇండియన్లు మక్కువ చూపిస్తున్నారు. క్రిస్మస్‌ పండగ హడావుడి ముగిసింది మొదలు ట్విట్టర్‌ ఇండియాలో విజయ్‌మాల్యా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒకప్పుడు అందమైన మోడల​‍్స్‌తో కింగ్‌ ఫిషర్‌ విమానాల్లో, విలాసంతమైన యాచ్‌లలో గడిచిన మాల్యా ఓ సాధారణ ప్రయాణికుడిలా చిన్న బ్రీఫ్‌కేస్‌తో రైలుతో ప్రయాణిస్తున్న ఫోటో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ఓనర్‌ టూ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అంటూ రకరకాల కామెంట్లతో అనేక ట్వీట్లు వస్తున్నాయి ఈ ఫోటోతో. వాస్తవానికి ఈ ఫోటో 2017 లేదా అంతకంటే ముందు కాలానికి సంబంధించింది. లండన్‌ నుంచి మాంఛెస్టర్‌కి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమైన రైలులో మాల్యా ప్రయాణం చేశారు. ఈ ఫోటో ఇప్పటికే పలుమార్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. కాగా డిసెంబరు 18 విజయ్‌మాల్యా పుట్టినరోజు.. దీంతో ఆయనపై ఆసక్తి ఉన్న కొందరు మరోసారి లండన్‌ ట్రైన్‌ ఫోటోలను నెట్టింట్లో పోస్ట​ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. 

No comments:

Post a Comment