ఉదయపూర్ లో మెగాస్టార్ దంపతులు

Telugu Lo Computer
0


మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగింది. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి. ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)