తెలంగాణలో 'పుష్ప' ఐదు షోలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 December 2021

తెలంగాణలో 'పుష్ప' ఐదు షోలు !


అల‍్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్ లో  వస్తున్న ‘పుష్ప ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “పుష్ప” చిత్రం కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 17 తేదీ నుంచి 30 తేదీ వరకు అదనపు షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఇక రూ.50 టికెట్ల పెంపుపై కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ప్రభుత్వం ప్రత్యేక షోలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. నాలుగు షోలే ఉండటంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35ను హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది. థియేటర్ల యాజమాన్యం తరపున న్యాయవాది దుర్గాప్రసాద్ వాదిస్తూ టిక్కెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, అది ఓనర్ల హక్కు అని అన్నారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు జిఒను సస్పెండ్ చేసింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది. అయితే హైకోర్టు ఈ విషయంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

No comments:

Post a Comment