కేవైసీ వెరిఫికేషన్ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 December 2021

కేవైసీ వెరిఫికేషన్ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి...!


ప్రస్తుతం అన్ని పనులు కూడా ఆన్ లైన్లోనే చాలా ఈజీగా నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ సిస్టం కూడా ప్రజలకు చాలా ఉపయోగడుతోంది. సులభమైన ఆన్ లైన్ పేమెంట్ ప్రయోజాలతో పాటుగా ఈజీగా చేసే మోసాలు కూడా పుట్టుకొచ్చాయి. ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ టెలికాం వినియోగదారులు ఇంటర్నెట్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని ఇటీవల హెచ్చరించారు.  కేవైసి  వెరిఫికేషన్ అని చెప్పబడే ఒక స్పామ్ మెసేజ్ ద్వారా కొత్త స్కామ్ కు పాల్పడుతున్నట్లు సూచించారు. ఈ ఎస్ ఎం ఎస్  లో ఏమని ఉంటుందంటే, ఈ మెసేజ్ కు రెస్పాండ్ అవ్వకపోతే మీ నంబర్ 24 గంటల్లో బ్లాక్ అవుతుందని ఉంటుంది. Airtel, Vodafone, Idea మరియు Jio యూజర్లు కూడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల ముసుగులో కేవైసి వెరిఫికేషన్ కోసం అంటూ చెప్పబడే నకిలీ మెసేజెస్ అందుకుంటున్నారు. ట్విటర్ సాక్షిగా చాలామంది వినియోగదారులు ఈ విషయం గురించి వెల్లడించారు. ఎయిర్టెల్ నంబర్ కలిగిన కస్టమర్లు, వారి మొబైల్ నంబర్ కు 9114204378 నంబర్ నుండి 0 అనే మెసేజ్ అందుకుంటున్నారు. లోపలికి వెళితే అందులో, 'డియర్ ఎయిర్టెల్ కస్టమర్, ఈ రోజు మీ సిమ్ నిలిపివేయ బడుతుంది. మీ SIM కార్డు ను అప్డేట్ చేసుకోండి' దీని కోసం మీరు వెంటనే 8582845285 కాల్ చేయండి, అని ఉంటుంది. అంతేకాదు, మీరు వెంటనే సంప్రదించగా పొతే మీ సిమ్ బ్లాక్ అవుతుందని కూడా చూపిస్తుంది. ఈ రకమైన మేసేజెస్ ద్వారా వినియోగదారుల దృష్టి మరల్చడం మరియు వారు రెస్పాండ్ ఇచ్చినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. ఈవిధంగా వారి నుండి వివరాలను రాబట్టి వారి బ్యాంకుల నుండి డబ్బును విత్ డ్రా చేయడం జరుగుతోంది. అందుకే, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాల మంచిది. ఆన్లైన్ మాసాలకు ముఖ్యంగా కావాల్సింది 'OTP' కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చే OTP లను ఎట్టిపరిస్థితుల్లోను మరొకరితో షేర్ చెయ్యకండి. 

No comments:

Post a Comment