కెనడాలో 9 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ!

Telugu Lo Computer
0


కెనడా అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో 9,12,600 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయట!. కరోనా కారణంగానే కెనడాలో ఈ పరిస్ధితి ఎదురైనట్లుగా తెలుస్తోంది. 2019 ప్రారంభంలో అన్ని రంగాలతో కలిపి దేశంలో సుమారు 3,49,700 ఉద్యోగాలు ఖాళీలు వుండగా ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపయ్యింది. 2019 మూడవ త్రైమాసికం నుంచి 2021 మూడవ క్వార్టర్ మధ్యలో 18 రంగాల్లో ఖాళీలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అగ్రికల్చర్‌, ఫారెస్ట్రి, ఫిషింగ్‌, హంటింగ్‌, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఖాళీలు ఏర్పడలేదు. హెల్త్ కేర్‌, కన్‌స్ట్రక్షన్‌, అకామిడేషన్ అండ్ ఫుడ్‌, రిటేల్ ట్రేడ్‌, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో మాత్రం ఖాళీలు పెరుగుతున్నాయి. తక్కువ జీతాలు ఉండే రంగాల్లో మాత్రమే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి కోసం కెనడా ప్రభుత్వం భారీ స్థాయిలో ఇమ్మిగ్రేషన్ విధానాలను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెనడీయన్లలో సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ ట్రూడో రాబోయే సంవత్సరం 4,11,000 మందికి శాశ్వత పౌరసత్వం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కెనడియన్ తయారీ, ఎగుమతిదారుల సంఘం 2030 నాటికి పరిస్ధితులు మరింత క్లిష్టంగా మారుతాయన్న నేపథ్యంలో వలసదారులకు తలుపులు తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)