సినీ కెరీర్ నాశనం చేసుకున్న వడివేలు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 December 2021

సినీ కెరీర్ నాశనం చేసుకున్న వడివేలు!


తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులోను వడివేలుకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కామెడీ టైమింగ్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు కింగ్ లా బతికిన ఈ కమెడియన్.. ఇప్పుడు డల్ అయిపోయాడు. ఒకప్పుడు ఈయన పేరంటే తమిళనాట ఓ సంచలనం. ఒకప్పుడు తమిళ సినిమా కామెడీని శాసించిన రారాజు వడివేలు. ఆయన లేకుండా సినిమా చేయడం అనేది అసాధ్యం. ఒకే ఏడాదిలో 30 నుంచి 40 సినిమాలు చేసేవాడు వడివేలు. సినిమా ఏదైనా హీరో ఎవరైనా కచ్చితంగా కమెడియన్ గా ఆయన ఉండాల్సిందే. ఈయన డేట్స్ కావాలంటే ఎంత పెద్ద నిర్మాతకైనా చమటలు పట్టేవి. చివరికి రజినీ అంతటివాడే ముందు వడివేలు డేట్స్ తీసుకుని తన దగ్గరికి రండి అనే స్థాయిలో ఉండేది  కానీ ఒక్క వివాదం వడివేలు కెరీర్ ను నాశనం చేసింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వడివేలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. 2011 ఎన్నికల టైమ్ డిఎంకేకు ప్రచారం చేసిన వడివేలు. ఆ సమయంలో లో అమ్మ జయలలితతో పాటు రజినీకాంత్ కు వ్యతిరేకంగా పబ్లిక్ గా వడివేలు చేసిన కమెంట్స్ తమిళనాట సంచలనం సృష్టించాయి. వడివేలు కామెడి పంచులతో ఎండీఎంకే తో పొత్తుపెట్టుకున్న జయలలితపై సెటైర్లు వేస్తూ ఆమె గాలితీశాడు. అమ్మ పరువు తీశాడు. ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే వడివేలు ప్రచారం చేసిన ప్రతి చోటా డీఎంకే డిజాస్టర్ అయ్యింది. అమ్మ అధికారంలోకి రాగానే రీవెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఈ దెబ్బకు వడివేలు సినిమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఆయనను సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేసింది జయలలిత. దాంతో అప్పటికే వడివేలు నటించిన సిమాలను నిలిపివేసి ఆయన నటించిన సీన్లను ఎడిట్ చేసారు. అలా ఆవేశంతో తాను అన్న మాటలకు ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేకుండా తన కెరీర్ నాశనం చేసుకున్నాడు వడివేలు. అయితే ఇప్పుడు డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇప్పటి నుండి వడివేలు కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.


No comments:

Post a Comment