రక్తహీనత - నివారణ

Telugu Lo Computer
0



మెంతులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మెంతులలో కొవ్వులొ కరిగే క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా మెంతులు తగ్గిస్తాయి. బీట్ రూట్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ ప్రతి రోజు తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి చాలా త్వరగా బయటపడవచ్చు. బీట్‌రూట్ రక్తంలో ఉండే ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచటమే గాకుండా. శరీరానికి కావలసిన తాజా ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ ని శోషించుకోవటానికి సహాయపడుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. కిస్ మిస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కిస్ మిస్ తీసుకోవటం వలన రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇది హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడం మాత్రమే కాదు, రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే బెల్లంలో కూడా ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రక్త హీనత తో బాధపడుతున్న వారిలో ఐరన్ లేకపోవటం వలన అలసట, బలహీనత కలుగుతాయి.ఖర్జూరంలో ఉండే ఐరన్ ఈ సమస్యను తగ్గిస్తుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)