పులి నోటికి జైలో కారు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 31 December 2021

పులి నోటికి జైలో కారు !

 

కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ నేషనల్ పార్క్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. మైసూరులోని తప్పేకాడ వద్ద చిరుతపులుల ఎన్‌క్లోజర్ గుండా జైలో ప్రత్యేక వాహనంలో సందర్శకులు ప్రయాణం చేస్తుండగా, రోడ్డుపై పులుల గుంపు కనిపించింది. వెంటనే కారును దారి పక్కన పార్క్ చేశారు. పులులను వీడియో తీస్తున్నారు. ఈలోగా వెనుక నుంచి ఓ పులి వచ్చి జైలో కారును తన పళ్లతో గట్టిగా పట్టుకొని వెనక్కిలాగే ప్రయత్నం చేసింది. వెనక్కి లాగేందుకు చాలాసేపు ప్రయత్నం చేసింది. ఒకనోక దశలో ఆ పులి వల్ల కాలేదు. కానీ, పట్టువదలకుండా బంపర్‌ను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేసింది. దీంతో ఆ జైలో వాహనం కొన్ని మీటర్లమేర వెనక్కి వెళ్లింది. లోపల ఉన్న టూరిస్టులు భయాందోళనకు గురయ్యారు. కారు డ్యామేజ్ అయితే మొదటికే మోసం వస్తుందని టూరిస్టులు భావించారు. కారు వెనక్కి రావడంతో భయపడిన ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో టూరిస్టులు ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జైలో కారును పులి కొరకడంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని, జైలో కారు డెలీషియష్ గా ఉంటుందని ఆ పులికి కూడా తెలిసిపోయిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

No comments:

Post a Comment