బాయ్‌ఫ్రెండ్ కోసం ఫైటింగ్ !

Telugu Lo Computer
0

 

విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో జుట్టు పీక్కొని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న వారు వారిని ఆపారు.  కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు ప్రియుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి చదివిస్తే కాలేజీలకు వెళ్లి ప్రేమ పాటలు తప్ప చదువుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, స్థానికులు చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)