మెరుగుపడ్డ బొగ్గు నిల్వలు

Telugu Lo Computer
0


 

దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్‌ నెలలో బొగ్గు నిల్వలు కాస్త మెరుగుపడ్డాయి. కానీ, ఆ నిల్వలు కేవలం తొమ్మిదిన్నర రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. గత రెండు నెలలతో పోలిస్తే నవంబర్‌లో 18.95 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ లోక్‌సభలో గురువారం చెప్పారు. ఇవే కేంద్రాల వద్ద సెప్టెంబర్‌లో 10.37 మిలియన్‌ టన్నుల నిల్వలుండగా అక్టోబర్‌లో కేవలం 8.07 మిలియన్‌ టన్నుల నిల్వలే ఉన్నాయి. దేశంలోనే 136 బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో నవంబర్‌లో మొత్తంగా 18.958 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇవి తొమ్మిదిన్నర రోజులకే సరిపోతాయి. వాస్తవానికి ప్రతీ ఏటా ఫిబ్రవరి-జూన్‌ కాలానికి బొగ్గు గనుల దగ్గర్లోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల వద్ద 17 రోజులకు సరిపడా నిల్వలు, బొగ్గు గనులకు సుదూరంగా ఉన్న విద్యుత్‌ కేంద్రాల్లో 26 రోజులకు సరిపడా నిల్వలు తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం తాజాగా నిబంధనలను సవరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)