డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ రూ. 49 కే .!

Telugu Lo Computer
0


ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థలు యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను విభినమైన ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తన బేసిక్‌ ప్లాన్స్‌ రేట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఓటీటీ దిగ్గజం డిస్నీ-హాట్‌స్టార్‌ కూడా సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లిస్తే నెలరోజులపాటు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను అందించనుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ రూ. 49 ప్లాన్‌ ఎంపిక చేసిన యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌తో యూజర్స్‌ ఏదైనా ఒక డివైజ్‌లో మాత్రమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా 720 పిక్సెల్ హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీడియోలను చూసే అవకాశాన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌ కల్పించనుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ సేవలు కేవలం రూ. 49 కు వస్తోందనే ఫోటో ప్రముఖ సోషల్‌ మీడియా మాధ్యమం రెడిట్‌ హల్‌చల్‌ చేస్తోంది. కాగా ఈ విషయంపై డిస్నీ+ హాట్‌స్టార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిస్నీ+హాట్‌స్టార్‌ నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లకు రూ.99 అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ను ఆయా యూపీఐ యాప్స్‌ ద్వారా సబ్‌స్క్రిప్షన్ చేసిన యూజర్లకు రూ.49కే వచ్చినట్లు కొంతమంది యూజర్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)