వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 December 2021

వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ!


తనపై రెక్కీ నిర్వహించారన్న వంగవీటి రాధా వ్యాఖ్యలపై సీఎం జగన్‌ విచారణకు ఆదేశించారు. ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆయన వెంటనే ఇంటెలిజెన్స్‌ డీజీని ఆదేశించారు. మరోవైపు రాధాకు వెంటనే 2+2 సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు కొడాలి నాని. తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు విజయవాడ  పోలీసులు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేనికీ భయపడనని.. ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు రాధా. వంగవీటి రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. అంతేకాదు తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు.. ఈ కామెంట్స్‌ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

No comments:

Post a Comment