'ఓమ్రికాన్‌'పై అప్రమత్తంగా ఉండండి

Telugu Lo Computer
0


దేశంలో కరోనా తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్రమోడీ సమీక్ష నిర్వహించారు. అధికారులతో రెండు గంటలపాటు ప్రధాని సమీక్ష కొనసాగింది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమ్రికాన్‌ పై ప్రధానికి అధికారులు వివరించారు. ఓమ్రికాన్ లక్షణాలు, వివిధ దేశాల్లో దాని ప్రభావంపై ప్రధానికి అధికారులు చెప్పారు. కొత్త రకం వైరస్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో అత్యంత పకడ్బందీగా నియంత్రణ, పటిష్ట నిఘా పెట్టాలని అధికారులకు ప్రధాని సూచించారు. నిబంధనల మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల కోవిడ్ నమూనాలను సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం సహా అన్ని జాగ్రత్తలు కఠినంగా అమలు చేయాలని ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్స్ పనితీరుపై రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ప్రధాని సూచించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరించాలన్న ఆలోచనను మరోసారి పునఃసమీక్షించాలని అధికారులకు ప్రధాని చెప్పారు కోవిడ్ టీకా రెండవ డోసు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న అందరికీ వెంటనే వ్యాక్సిన్ అందేలా చూడాలని రాష్ట్రాలకు సూచించాలని ప్రధాని మోడీ చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)