దిగొచ్చిన రాపిడో...!

Telugu Lo Computer
0


ఆర్టీసీ బస్సు ఎక్కితే మసాలా దోశలా నలిగిపోతావ్, రాపిడో బుక్ చేసుకో సింపుల్‌గా పోతావ్ తొందరగా ఎక్కెయ్ అనేది అల్లు అర్జున్ చేసిన యాడ్. ఈ యాడ్‌ వివాదాన్ని రేపింది. రాపిడో సంస్థ ఇటీవలే విడుదల చేసిన యాడ్‌లో అల్లు అర్జున్​ నటించాడు. అందులో.. దోశలు వేసే వ్యక్తిగా బన్నీ కనిపించాడు. రాపిడోను ప్రమోట్​ చేసే క్రమంలో.. బస్సు ప్రయాణాన్ని దోశతో పోల్చుతూ డైలాగ్స్ చెప్తాడు. బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాపిడో సేవలను ఉపయోగించుకోవాలని ఆ యాడ్ సారాంశం. పేదవారి సేవలో ఉన్న ఆర్టీసీ బస్సును కించపరుస్తూ రూపొందించిన ఈ యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.  ఆర్టీసీని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ యాడ్‌లో నటించిన అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. ఇలాంటి యాడ్‌కు రూపొందించిన రాపిడో సంస్థకూ నోటీసులు పంపారు. ప్రజాజీవనంలో భాగమైన ఆర్టీసీ బస్సును కించపరిచేలా యాడ్‌ రూపొందిస్తారా ? అని మండిపడ్డారు సజ్జనార్‌. సమాజాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న సెలబ్రిటీలు.. డబ్బుల కోసం ఇలాంటి వాటిల్లో నటించడం భావ్యం కాదన్నారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరన్నారు. తమ నోటీసులకు స్పందించకపోతే.. లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.రాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్‌కు సజ్జనార్‌ లీగల్‌ నోటీసులు ఇవ్వడంతో ర్యాపిడో సంస్థ దిగొచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సీటీ బస్సును ఉపయోగించుకుని యాడ్‌‌లో చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)