సంక్రాంతి బరిలో 'భీమ్లా నాయక్'

Telugu Lo Computer
0


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరో. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ మరోసారి స్పష్టం చేసింది. సంక్రాంతి బరిలో 'భీమ్లా నాయక్'తో పాటు మరికొన్ని భారీ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో ఓ సినిమా వెనక్కి వెళ్లింది. 'భీమ్లా నాయక్' కూడా వెనక్కి వెళుతుందనే మాటలు వినిపించాయి. అయితే... ఈ రోజు నిర్మాతలు చేసిన ప్రకటనతో సంక్రాంతి బరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, అందులో ఎటువంటి మార్పు లేదని తెలిసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)