రాత్రివేళల్లో పోస్టుమార్టం చేయొచ్చు!

Telugu Lo Computer
0


ఆస్పత్రుల్లో రాత్రి పూట కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్నారు. రాత్రి వేళల్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి పూట తగిన వసతులు, వైద్య సదుపాయాలు ఉన్న ఆస్పత్రుల్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేయవచ్చని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. ఈ విషయానికి సంబంధించి ట్వీట్‌ చేశారు. బ్రిటిష్‌ పరిపాలన కాలంలో తెచ్చిన విధానానికి స్వస్తి పలికామని తెలిపారు. ఇప్పటి నుండి ఆస్పత్రుల్లో ఎప్పుడైనా పోస్టు మార్టం చేయవచ్చన్నారు. రాత్రి పూట మృతదేహాలకు పోస్టుమార్టం చేసే అంశంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నియమించిన సాంకేతిక కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది. పెరిగిన టెక్నాలజీ, నూతన వైద్య సదుపాయాలతో రాత్రి పూట పోస్టుమార్టం చేసేందుకు ఇబ్బందులేమీ ఉండవని పేర్కొంది. ఆస్పత్రుల్లో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చని సూచించింది. అయితే లైంగిక దాడి, ఆత్మహత్యలు, హత్యలు, కుళ్లన మృతదేహాలు, అనుమానాస్పద మృతి కేసుల్లోని మృతదేహాలకు మాత్రం పగటి పూటే పోస్టుమార్టం నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)