'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ

Telugu Lo Computer
0


రవితేజ మంచి జోరు మీద ఉన్నాడు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రవితేజ.. ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. 2022లో సందడి చేసేందుకు తాజాగా ఐదు చిత్రాలను అంగీకరించాడు. 'ఖిలాడీ', 'రామారావ్ ఆన్ డ్యూటీ' సినిమాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. అంతేకాదు నక్కిన త్రినాధరావుతో 'ధమాకా' సినిమా, సుధీర్ వర్మలతో చిత్రాలకు కూడా ఓకే చెప్పేశాడు. తాజాగా దొంగాట వంశీ కృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తున్నట్లు రవితేజ ప్రకటించారు. ఈ చిత్రానికి 'టైగర్ నాగేశ్వరరావు' అనే టైటిల్ ఖరారు చేశారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ఇది. పాన్ ఇండియా మూవీకి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చాలా గ్యాప్ తర్వాత తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ (ఆకాశమే హద్దురా మ్యూజిక్ డైరెక్టర్, 'ఒరేయ్ బామ్మర్ది' హీరో) ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. 'ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్' అనే క్యాప్షన్ ఉంది. పులి అడుగుల నుంచి మనిషి అడుగులు.. పాదాలను పోస్టర్‌లో చూపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)