యువ డాక్టర్ హఠాన్మరణం

Telugu Lo Computer
0



ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం గాంధీ మెడికల్‌ కాలేజీ జనరల్‌ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్‌ చేశారు. గాంధీలోనే సీనియర్‌ రెసిడెంట్‌ విధులు కూడా పూర్తి చేశారు. సూపర్‌ స్పెషాలిటీ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌ కోసం ఫ్రెండ్స్ కలిసి పద్మారావునగర్‌లో నివాసముంటున్నారు. వారం రోజుల క్రితం అతనికి ఛాతిలో స్వల్పంగా నొప్పి అనిపించింది. వెంటనే  గాంధీలో హెల్త్ చెకప్ చేయించుకోగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి. రెండు రోజుల క్రితం మరోసారి గుండెల్లో నొప్పి రావడంతో గ్యాస్ వల్ల అనుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి మెడిసిన్ తీసుకున్నారు. అయితే రూమ్‌కి వెళ్లొద్దని, ఎమర్జెన్సీ విభాగం భవనం పైనున్న పీజీ హాస్టల్‌లో ఉండాలని సహచరులు సూచించడంతో ఆయన సరేనన్నారు. పీజీ హాస్టల్‌కు మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. అతడిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటివరకు తమతోనే ఉన్న డాక్టర్ పూర్ణచంద్ర గుప్తా మరణించారని తెలిసి ఆయన సహచరులు, మిత్రులు షాక్‌కు గురయ్యారు. పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్‌ ప్రకాశరావు, సూపరింటెండెంట్‌ రాజారావు, ఇతర డాక్టర్లు వాళులర్పించారు. అతడి సేవలను ప్రశంసించారు.  అనంతరం అతడి మృతదేహానికి అంత్యక్రియల నిమిత్తం స్వస్థలానికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)