రియల్ స్టార్ !

Telugu Lo Computer
0

 

కొన్ని సంవత్సరాల క్రిత హైదరాబాద్ జింఖానా మైదానంలో వరద బాధితుల కోసం ఒక ప్రఖ్యాత క్రికెటర్ ఇచ్చిన "బ్యాట్ "వేలం జరుగుతోంది  సినీపరిశ్రమలోని మహామహులంతా ఆ వేలం పాటకు విచ్చేశారు. బ్యాట్ వేలం పాట మొదలైంది. సినీహీరోలు పాట పాడటం ప్రారంభించారు. అంతా వేలల్లోనే పాడుతున్నారు. అతి కష్టం మీద 1.5 లక్షలకు చేరుకుంది పాట. నిర్వాహకులకు నిరాశ. అంతలో తెల్లని  ఫ్యాంట్, షర్ట్ ధరించి, మాసిన గడ్డం, చేతిలో గుడ్డసంచితో వచ్చాడొకవ్యక్తి.. వస్తూనే . నా పాట ₹8,50000 (ఎనిమిది లక్షలా యాభైవేలు) అంటూ అరిచాడు, అంతా నిర్ఘాంతపోయారు. అగ్ర హీరోలకు సైతం  నోట మాటరాలేదు. నిర్వాహకులు ఆనందంగా ఆయన పాటను ఫైనలైజ్ చేశారు. తన వెంట తెచ్చుకున్న గుడ్డసంచిలోని డబ్బునంతా టేబుల్ మీద పోసి బ్యాట్ తీసుకొని దానిని ముద్దుపెట్టుకొని మళ్ళీ దానిని ఒక అనాధ శరణాలయానికి ఇచ్చేశాడు.. నా దగ్గర అంత డబ్బేవుంది. లేకుంటే అంతకంటే ఎక్కువే పాడేవాడిని  అని నవ్వుతూ చెప్పాడా వ్యక్తి. అతనే ఆర్.  నారాయణమూర్తి పీపుల్స్ స్టార్.  దాదాపు 25 సినిమాలు తీసినాఈ రోజుకీ సొంత ఇల్లులేని నటుడు. కేవలం ఒక చాప, దిండు అతని ఆస్థి, తను సంపాదించినదంతా పేదలకే పంచాడు. ఎక్కడ తాను పెళ్ళిచేసుకుంటే సమాజ సేవకు ఆటంకమవుతుందో అని పెళ్ళి చేసుకోకుండానే "బ్రహ్మచారి"గా మిగిలిపోయాడు.. హీరోలంటే ఆరడగులు, అందమైన ముఖం,కండలు తీరిన శరీరం కాదు...అందమైన మనసు ... నారాయణమూర్తిగారే అతి గొప్ప హీరో. 👏👏👏

Post a Comment

0Comments

Post a Comment (0)