కెనడాకు చేరుకున్న ఎన్ఐఏ బృందం

Telugu Lo Computer
0


జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం కెనడాకు చేరుకుంది. ఈ బృందం ఖలిస్థాన్‌, సిక్కు ఫర్ జస్టిస్ వంటి సంస్థలకు మద్దతూనిస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే సంస్థలకు వస్తున్న నిధులు, వాటిని సమకూరుస్తున్న వివిధ సంస్థలు పై ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దీనిలో భాగంగానే శుక్రవారం ఎన్ఐఏ బృందం కెనడాకు చేరుకుంది. నాలుగు రోజుల పర్యటనలో విదేశీ సంస్థలతో ఈ వేర్పాటువాద సంస్థల సంబంధాలపై ముగ్గురు సభ్యుల ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బృందానికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారు. రాడార్‌లోని సంస్థలలో  సిక్కు ఫర్ జస్టిస్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉన్నాయి. కెనడా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ జర్మనీల నుండి వారి విదేశీ నిధుల మార్గాలను పరిశీలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడా ది ప్రారంభంలో, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులను ప్రేరేపిం చడానికి, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండాను ఎగురవేసే వారికి సిక్కు ఫర్ జస్టిస్ 2.5 లక్షల యూఎస్‌ డాలర్ల బహుమతిని ప్రకటించింది. సిక్కు ఫర్ జస్టిస్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను, ఒక వీడియోలో, రైతుల నిరసనను 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లతో ముడిపెట్టడానికి ప్రయత్నించాడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)