నడక - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


నడక మంచి ఆరోగ్యానికి హేతువని వైద్యులు అంటారు. రోజు వాకింగ్ చేయటం అలవాటుగా చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావంటారు. నడక అనేది నిరాడంబర వ్యాయామం. నడక లేదా పరుగెత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. మీకు తెలిసి ఉండాలి కదా.! నడక వల్ల శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్త పోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాలను నడక దూరం చేస్తుంది. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుది సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందట!. పగటిపూట ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాగని ఈ 150 నిమిషాల పాటు అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు. సాధారణ నడకతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని, తీవ్రతను పెంచుకుంటూ పోవాలి.. ఒక వ్యక్తి వారానికి ఐదు రోజుల పాటు.. ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున ఇలాంటి వ్యాయామం చేయాలని  నిపుణులు అంటున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)