ఎలిమినేషన్‌ అస్సలు ఊహించలేదు

Telugu Lo Computer
0


బిగ్‌బాస్‌ సీజన్‌-5లో టాప్‌ 8 వరకూ వచ్చి అనూహ్య రీతిలో ఎలిమినేషన్‌ ఎదుర్కొని హౌస్‌ నుంచి బయటకు వచ్చిన రవి తాజాగా ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అరియానా వ్యాఖ్యాతగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో రవి తన మనసులోని మాటలు బయటపెట్టారు. టాప్‌ 2లో ఎవరు ఉంటారనే విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. 'నేను ఎలిమినేట్‌ అవుతానని అస్సలు ఊహించలేదు. ఇప్పటికీ నాకింకా షాక్‌గానే ఉంది. ఇంటిసభ్యులు చాలామంది నన్ను 'గుంట నక్క' అని ఏడిపించేవారు. ఆ మాటకు నేనేమీ బాధపడలేదు. అస్సలు దాని గురించి పట్టించుకోలేదు. అంతేకాకుండా నన్నందరూ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అన్నారు. నాకు తెలిసినంత వరకూ నేను ఎవర్నీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయలేదు. ఒకవేళ నా మాటలకు వాళ్లు ఇన్‌ఫ్లూయెన్స్‌ అయ్యారేమో'' అని రవి తెలిపారు. అనంతరం ఇంటిసభ్యుల గురించి మాట్లాడుతూ..''నటనరాజ్‌ మాస్టర్‌ మైండ్‌లో ఏదో పెట్టుకొని ఇంటిలోపలికి అడుగుపెట్టారు. షణ్ముఖ్‌.. గేమ్‌ ఆడినట్లు అస్సలు నాకు కనిపించలేదు. ఇక, మానస్‌ మీద పింకి చాలా ప్రేమ చూపిస్తుంది. కానీ మానస్‌కి ఆమెపై ఎలాంటి ప్రేమ లేదు. కాజల్‌ గేమ్‌ ఛేంజర్‌ కాదు. గేమ్‌ డిస్టర్బర్‌. సిరి-షణ్ముఖ్‌ మధ్య ఎలాంటి కనెక్షన్‌ ఉందో తెలీదు. కానీ, సిరి మాత్రం చాలా సార్లు షణ్ముఖ్‌ని ఇష్టపడుతున్నట్లు చెప్పింది'' అని రవి వివరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)