జగనన్న బాణాసంచా!

Telugu Lo Computer
0


దీపావళి సందర్భంగా పలు రకాల బాణసంచా మార్కెట్లో సందడి చేస్తోంది. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, మతాబులు, రాకెట్లు, వంకాయ బాంబులు వంటివి ఎప్పుడూ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏపీలో ఈ సారి కొత్తగా జగన్ ఆటం బాంబులు వచ్చాయి. సీఎం జగన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని తయారీదారులు ఇలా ప్రయత్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం తరువాత కూడా ఈ ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయి. విపక్ష నేతలపై సెటైర్లు వేస్తూ వైసీపీ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సీఎం జగన్ ఫోటోతో ఉన్న దివాళీ క్రాకర్స్ ఫోటోలకు.. విపక్ష నేతల ఫోటోలను జోడిస్తే.. అది జగన్ అన్న సత్తా అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు వ్యాపారులు తమ ప్రమోషన్స్ కోసం నేరుగా ఏపీ సీఎం జగన్ బొమ్మనే వాడేశారు. ఆయన పేరు మీద చాలా రకాల ఆటం బాంబులు, భూ చక్రాలు, చిచ్చుబుడ్లు లాంటివి తయారు చేశారు. ఇందులో ఆటం బాంబులు చాలా స్పెషల్ గా నిలుస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)