పెద్ద మేడపల్లి మహిళల వింత డిమాండ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద మేడపల్లి గ్రామంలో మహిళలు వింత ఆందోళన చేపట్టారు. తమ ఊరిలో సమస్యలు తీర్చమనో, రోడ్డు వేయమనో లేదా మరో డిమాండ్ తోనో ధర్నాలు, నిరసనలు చేయడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఆ ఊరి మహిళలు మొత్తం ఓ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. తమ ఊరికి మద్యం షాపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఊరిలో ఉన్న మహిళలు అంతా కదిలి వచ్చారు. ఒకప్పుడు ఇదే ఊరికి మద్యం షాపు వద్దంటూ ఈ మహిళలే ధర్నా చేశారు. దీంతో అధికారులు అప్పుడు ఆ ఊరికి మద్యం షాపు కేటాయించలేదు. కానీ ఇప్పుడు ఆ మహిళలే.. మద్యం షాపు కావాలని అధికారులను కోరుతున్నామంటూ రోడ్డెక్కారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ సరికొత్త డిమాండ్ తో మండల అధికారులు మాత్రం అవాక్కవుతున్నారు.. ఈ వింత డిమాండ్ ను   చూసిన వారు,  విన్నవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఇదే పెదమేడపల్లిలో.. తమ ఊరికి మద్యం షాపు వద్దంటూ ఇదే మహిళలు ధర్నా చేశారు. దీంతో అధికారులు ఆ ఊరికి మద్యం షాపు కేటాయించలేదు. కానీ ఇప్పుడు ఆ మహిళలే మద్యం షాప్ కావాలని కోరుకుంటున్నారు. మద్యం షాపులు లేకపోతే తమ మగవాళ్లు.. తాగుడుకు దూరం అవుతారని, తమ ఇళ్లు, సంసారాలు బాగుపడతాయని ఆ మహిళలు భావించారు. కానీ ఆ గ్రామంలో వైన్ షాపు లేకపోవడంతో.. బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పక్క ఊళ్ల నుండి మద్యం బాటిల్స్ ను కొని తీసుకువచ్చి బెల్టు షాపులు నడుపుతూ.. ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పక్క ఊళ్లలో ఉన్న వైన్స్ షాపులతో పోలిస్తే .. ఇక్కడి బెల్ట్ షాపుల్లో మద్యం ధరలను డబుల్ ధరలకు అమ్ముతున్నారు.. చీప్ లిక్కర్ పై కూడా ఒక్కో బాటిల్‌పై 50 నుంచి 100 వరకు ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో సంపాదన మొత్తాన్ని తమ మగాళ్లు తాగుడుకే ఖర్చు చేయాల్సివస్తోందని అక్కడి మహిళలు గత కొంత కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరి కాదని భావించిన గ్రామ మహిళలు.. తమ ఊరికి మద్యం షాపు కేటాయించాలని అక్కడి అధికారులను కలిసి తమ కొంత కాలంగా వైన్ షాపు కేటాయించమని అడుగుతున్నారు. కానీ ఆ డిమాండ్ ను అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఊళ్లో ఉన్న బెల్ట్ షాపులనైనా తొలగించండి లేదంటే మద్యం షాపునైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గ్రామస్థులు నినదించారు. మద్యం షాపుల కన్నా .. మా గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువగా ఉన్నాయని.. ఒక్కో బాటిల్ పై 50 రూపాయల నుండి 100 ఎక్కువగా అమ్ముతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోక పోవడం వల్ల మీడియాను ఆశ్రయించవలసి వచ్చిందని అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)