కత్తితో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 21 November 2021

కత్తితో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు!


రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన 28ఏళ్ల యువకుడు జైపూర్‌లో చదువుకుంటూనే యోగా టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి 35 ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఆమె కూడా యోగా టీచర్ అవడం జైపూర్‌లోనే నివసిస్తుండటంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దీంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి సరదాగా కొద్ది సమయం అక్కడే గడిపి వెళ్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే నవంబర్ 16న సదరు కుర్రాడికి ఆ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. కూరగాయలు, పాలు తీసుకుని ఇంటికి రమ్మనడంతో అతడు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడే భోజనం చేసిన అతడు తిరిగి తన ఇంటికి బయల్దేరాడు. మహిళ కూడా అతడితో పాటే అతని ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ యువకుడికి బాగా నిద్ర పట్టేసింది. దీంతో అతను వెళ్లి తన గదిలో పడుకున్నాడు. అయితే ఏదో నొప్పిగా అనిపించడంతో అతను అకస్మాత్తుగా రాత్రి 2 గంటల ప్రాంతంలో నిద్రలోంచి మేలుకున్నాడు. తన మర్మాంగం కట్ అయి కింద పడి ఉండటం చూశాడు. ఆ మహిళ కట్ చేసిందని గ్రహించి ఆమెకు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో ఆ మహిళ నుంచి అతనికి అనుకోని సమాధానం ఎదురయింది. ఫోన్లో అతడికి సారీ చెప్పడంతో ఆ కుర్రాడు కంగుతిన్నాడు. అనంతరం ఆమే అతడికి ఇంటికి మళ్లీ వెళ్లి నొప్పితో బాధపడుతున్న కుర్రాడిని హాస్పిటల్‌లో చేర్పిండంతో వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేశారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆహారపదార్థాల్లో మత్తు పదార్థాలను కలిపి.. అతడు స్పృహ కోల్పోయేలా చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా రాబట్టలేదు.

No comments:

Post a Comment