30శాతం పెరగనున్నఆహారపదార్ధాల ధరలు

Telugu Lo Computer
0

   


ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రెస్టారెంట్లలో ఫుడ్ రేట్ ను 30 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ తిందామనుకునేవారు పెరగనున్న ధరలకు తగ్గట్లుగా సిద్ధం అవడం మంచిది. ఒక్క ఐటెం అని కాకుండా ఫుడ్ ఐటెంలు అన్నింటిపైనా ఈ ధరల పెంపుదల వుంటుంది. కొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్, వంటనూనె ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉల్లిపాయల ధరలు మరోవైపు మండిపోతున్నాయి. వీటన్నిటి ప్రభావం రెస్టారెంట్లోని ఫుడ్ ఐటెంస్ పై ప్రభావం చూపిస్తున్నాయి. లాక్ డౌన్ లు, రెస్టారెంట్ నష్టాలు అన్నింటినీ తట్టుకుని నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)