ప్రపంచంలోనే పొడుగైన మహిళ

Telugu Lo Computer
0


టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ గా అవతరించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా పేర్కొంది. రుమేసా 7.07 అడుగుల (215.16 సెం.మీ) పొడవుంది. ఆమె అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్‌ సిండ్రోమ్‌ అని వైద్య నిపుణలు వెల్లడించారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు. దీంతో ఆమె అసాధారణంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్‌ చైర్‌ లేదా వాకింగ్‌ ఫ్రేమ్‌ సాయంతో నడుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)