మార్కెట్లోకి రానున్న లండన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు

Telugu Lo Computer
0


భారత వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్లోకి తీసుకొనిరావడం కోసం ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు. తాజాగా మరోక కంపెనీ తన ఎలక్ట్రిక్ ట్యాక్సీ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రముఖ లండన్ ఈవి కంపెనీ లిమిటెడ్ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ టీఎక్స్ కారును ఇండియాలో ప్రవేశపెట్టడం కోసం సిద్దం అవుతున్నట్లు ప్రకటించింది. ఆటోమేకర్ న్యూఢిల్లీలో కొత్త డీలర్ షిప్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ (ఎల్ఈవీసీ), ఎక్స్ క్లూజివ్ మోటార్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యాన్ని ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)