ద్విగ్విజయంగా ముగిసిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు!

Telugu Lo Computer
0


వంగూరి ఫౌండేషన్, తెలుగు తల్లి కెనడా వెబ్ మాస పత్రిక ఆధ్వర్యంలో కెనడా-అమెరికా తెలుగు సదస్సు దిగ్విజయంగా జరిగింది. టొరాంటో తెలుగు టైంస్, ఓంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఆటవా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణా అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరాంటో భాగస్వామ్యంలో ఈ సభలు రెండు రోజుల పాటు విజయవంతంగా జరిగాయి. కెనడా మినిష్టరు ప్రసాద్ పండా, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ , డేనియల్ నాజర్ , భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి , మహెజబీన్ సదస్సులో పాల్గొని తమ ప్రసంగాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సదస్సులో కెనడా, అమెరికా రచయితలు పాల్గొని కవితలు, కథలు, ప్రసంగాలు వినిపించారు. అమెరికా, కెనడా రచయితల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ సదస్సు దోహదం చేసిందని పలువురు పేర్కొన్నారు. ఇటువంటివి మరిన్ని జరగాలని మిత్రలు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. సదస్సు నిర్వహణలో ముందుండి నడిపించిన శ్రీ వంగూరి చిట్టెన్ రాజుకు సదస్సు నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రిక సంపాదకురాలు లక్ష్మీ రాయవరపు కృషి, అకుంఠిత దీక్ష, మొక్కవోని సంకల్పం ఈ సద్దస్సు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వహకులు పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)