కిలో ఉప్పు రూ. 130, ఉల్లిగడ్డ 150 ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 2 October 2021

కిలో ఉప్పు రూ. 130, ఉల్లిగడ్డ 150 !


ఉత్తరాఖండ్  రాష్ట్రంలోని పిథోరగఢ్ జిల్లాలో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలోనే కేజీ ఉప్పును రూ.130 వరకు విక్రయిస్తున్నారు. వంటనూనె ధర రూ.275-300 మధ్య ఉంది. కేజీ ఎర్ర పప్పు ధర రూ.200, కేజీ బియ్యం రూ.150, ఉల్లిపాయ కిలో రూ.125, చక్కెర, గోధుమ పిండి కేజీ రూ.150కి చేరింది. ధరలు సాధారణం కంటే 8 రెట్లు ఎక్కువ కావడం వల్ల స్థానిక ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పాడై పోవడంతో పాటు ఘాట్‌రోడ్లు కావడంతో రవాణ సౌకర్యాలకు కష్టంగా మారింది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లె నిత్యవసరం ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. దీంతో స్థానిక ప్రజలు అధిక ధరలు భరించలేరని వారిని ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని కోరుతున్నారు. దీంతో ధరలను అదుపులోకి తీసుకువచ్చేందుకు స్థానిక అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. మరోవైపు సరుకులు బ్లాక్‌లో విక్రయిస్తున్నవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవి కాలంలో వీరంతా వ్యవసాయం, పశువుల సంరక్షణ కోసం కొండపైకి వెళ్లి ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. శీతాకాలంలో హిమపాతం బారిన పడకుండా ఉండేందుకు కిందకు వస్తారు. అయితే వర్షాల కారణంగా ఇక్కడి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు, సరకులు సరఫరా చేసేందుకు రవాణా సౌకర్యం లేక ధరలు భారీగా పెరిగాయి.ప్రభుత్వ అధికారులు వీలైనంత త్వరగా తమ సమస్యలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేకపోతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad