తేనెను జుర్రేసే పురుగు !

Telugu Lo Computer
0



తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్‌ మోత్‌ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్‌ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్‌ మోత్‌ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)