సామాన్యుడి ప్రేమ కోసం...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 October 2021

సామాన్యుడి ప్రేమ కోసం...!


జపాన్‌ రాకుమారి మకో (30) తన ప్రియుడు కీ కొమురో (29)ను అక్టోబరు 26న పెళ్లాడనుంది. జపాన్‌ చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మకోకు టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో కొమురో సహాధ్యాయి. 2017లోనే ఈ జంట తాము ప్రేమపెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. కొమురో తల్లి కారణంగా తలెత్తిన ఆర్థిక వివాదాలతో ఈ పెళ్లి అప్పట్లో రద్దయింది. దీంతో న్యూయార్క్‌ వెళ్లిపోయిన కొమురో 'లా' చదివి, వారం రోజుల కిందటే జపాన్‌కు తిరిగొచ్చాడు. ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా అతడు జపాన్‌ వైపు తిరిగి చూడలేదు. వీరిద్దరి పెళ్లికి అంగీకరించిన రాజకుటుంబం గతంలోని ఆర్థిక వివాదాలతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నందున వివాహానికి పెద్దగా హడావుడి చేయట్లేదని శుక్రవారం ప్రకటించింది. వివాహానంతరం ఈ జంట న్యూయార్క్‌ వెళ్లి అక్కడే స్థిరపడనుంది. జపాన్‌ రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధపడ్డ మకో రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది. 

No comments:

Post a Comment