సాహిత్యంలో అబ్దుల్‌ రజాక్ కి నోబెల్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 7 October 2021

సాహిత్యంలో అబ్దుల్‌ రజాక్ కి నోబెల్

 

సాహిత్యంలో నోబెల్ బహుమతి, 2021ని టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌ రజాక్ గుర్నాహ్ గెలుచుకున్నారు. సంస్కృతులు, ఖండాల మధ్య అగాధంలో శరణార్థుల స్థితిగతులు, వలసవాదం ప్రభావాలను రాజీ లేకుండా, కారుణ్యంతో చొచ్చుకెళ్లి పరిశీలించినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ పురస్కారం క్రింద ఆయనకు 1.14 మిలియన్ డాలర్లు లభిస్తాయి. బ్రిటన్‌లో నివసిస్తున్న గుర్నాహ్ 'పారడైజ్', 'డిజెర్షన్' వంటి నవలలను ఆంగ్లంలో రాశారు. స్వీడిష్ డైనమైట్ ఇన్వెంటర్, సంపన్న వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం ఈ పురస్కారాలను 1901 నుంచి అందజేస్తున్నారు. గతంలో ఎర్నెస్ట్ హెమింగ్వే, గాబ్రియేల్ గార్షియా మార్కెజ్, టోనీ మోరిసన్ వంటి నవలా రచయితలు, పాబ్లో నెరుడా, జోసఫ్ బ్రాడ్‌స్కై, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి కవులు సాహిత్యంలో నోబెల్ బహుమతులను పొందారు. మెమోయిర్స్ రాసినందుకు విన్‌స్టల్ చర్చిల్‌కు ఈ పురస్కారం లభించింది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఫిజియాలజీ లేదా మెడిసిన్, సాహిత్యం అంశాల్లో నోబెల్ పురస్కారాలను ఈ అకాడమీ అందజేస్తుంది.

No comments:

Post a Comment

Post Top Ad