హరిత బాణాసంచా

Telugu Lo Computer
0


పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా హరిత హరిత బాణాసంచా (గ్రీన్‌ క్రాకర్స్‌) అందుబాటులోకి వచ్చింది. రెండేళ్ల కిందటే మార్కెట్‌లోకి వీటి రాక మొదలైనప్పటికీ ఈ సారి మాత్రం విస్తృతంగానే లభిస్తున్నాయి. వీటి ధరలు కొంచెం ఎక్కువే అయినా పర్యావరణ హితం దృష్ట్యా కొంతమంది వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. మనం కాల్చే సాధారణ బాణసంచా వల్ల కంటికి కనిపించని అతి సూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటివి అధిక మొత్తాల్లో విడుదలై వాయు కాలుష్యానికి కారణమవుతుంటాయి. కొన్ని రకాల బాణసంచాలో అధిక కాలుష్య ఉద్గారాలను విడుదల చేసే బేరియం, లిథియం, ఆర్సెనిక్‌ వంటి మూలకాల్ని వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగించే బాణసంచా తయారీ ఫార్ములాను కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)-నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) రూపొందించి అభివృద్ధి చేశాయి. వాటినే హరిత బాణసంచాగా పిలుస్తారు. సాధారణ బాణసంచాతో పోలిస్తే ఇవి 30-40 శాతం మేర తక్కువగా కాలుష్యకారక ఉద్గారాల్ని విడుదల చేస్తాయి. మామూలు బాణసంచా కాల్చేప్పుడు 160 డెసిబెల్స్‌ మేర శబ్దం వస్,  వీటి ద్వారా 100-125 డెసిబెల్స్‌ శబ్దం వస్తుంది. చిన్నచిన్న బాంబుల తయారీలో 33 శాతం అల్యూమినియం, 9 శాతం సల్ఫర్‌, 57 శాతం పొటాషియం నైట్రేట్‌ వినియోగిస్తారు. గ్రీన్‌ క్రాకర్‌లో ఈ రసాయన సమ్మేళనం అతి తక్కువ మోతాదులో ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)