బస్ కండక్టర్‌కు రూ. వందల కోట్ల ఆస్తి...!

Telugu Lo Computer
0

 


యడ్యూరప్ప సన్నిహితులపై ఆకస్మిక ఐటీ దాడి కర్ణాటకలోని బీజేపీ వర్గాల్లో సంచలనం రేపిందని తెలుస్తోంది. యడ్యూరప్ప ఐటీ సోదాలు తనవరకూ రాకుండా చేయగలిగారు కానీ తాజా దాడి అతన్ని కలవరపాటుకు గురి చేసిందని సమాచారం. యడ్యూరప్ప రెండో కుమారుడు విజయేంద్రకు సన్నిహితులైన ఉమేష్, పలువురు కాంట్రాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, హోల్‌సేల్ హార్డ్‌వేర్ ట్రేడర్లు, మరికొంత మంది ఇళ్లలో సోదాలు చేయాలని ఐటీ అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బెంగుళూరుతో పాటు బాగల్‌కోట్, తుమకూరుతో సహా అనేక ప్రదేశాలలో దాడులు చేసిన అధికారులు సంచుల నిండా డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లు మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు. విజయేంద్ర సన్నిహితులపై ఐటీ దాడులు జరుగుతుండటంతో వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. తండ్రి సీఎంగా ఉన్న సమయంలో విజయేంద్ర భారీ అవినీతికి పాల్పడ్డారని వ్యతిరేకులు భావిస్తుంటారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత హెచ్ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ, "రూ.25,000 కోట్ల విలువైన ఇరిగేషన్ కుంభకోణంలో విజయేంద్ర హస్తం ఉందని పదే పదే చెప్పాను. ఇప్పుడు ఐటీ దాడులు నా ఆరోపణలను రుజువు చేస్తున్నాయి" అని పేర్కొన్నారు. కర్ణాటకలో ఐటీ దాడులు జరగడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు. కానీ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, అతని కుమారులకు పర్సనల్ అసిస్టెంట్ అయిన ఉమేష్ పై ఐటీ దాడులు జరగడంతో ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రూ.25 వేల కోట్ల విలువైన నీటిపారుదల కాంట్రాక్టులలో "అనధికారిక కమిషన్" రూపేణా డబ్బును లాండరింగ్ చేసిన అభియోగంతో 25 మంది మధ్యవర్తులు, కంపెనీలు, కాంట్రాక్టర్లపై పదుల సంఖ్యలో ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. యడ్యూరప్ప కుడిభుజమైన ఉమేష్ రూ. 2500-3000 కోట్లకు పైగా విలువైన కమీషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఉమేష్ ఒక బీఎంటీసీ బస్ కండక్టర్ కాగా అతని జీతం నెలకు రూ.32,000 మాత్రమే. ఇటీవల ఓవైపు అప్పులు మరోవైపు జాబు ఊడిపోవడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)