పోషకాహారంతో ఆయుర్దాయం పెంచుకోండి..!

Telugu Lo Computer
0


మనం తీసుకునే ఆహారం, జీవనశైలి బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పోషకాహారం తీసుకోవడం, ఆకు కూరలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. ఈ ఆహార పదార్థాలను డైట్ లో తీసుకోవడం వల్ల ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవచ్చు.

ఆకు కూరలు: ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఆకుకూరలు సహాయపడతాయి. ముఖ్యంగా పాలకూరలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ సమస్యలు రాకుండా ఇదే చూసుకుంటుంది. అలానే ఆయుర్దాయాన్ని పెంపొందించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

ఓట్స్: ఓట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పైగా వీటిని మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఒక సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఆరు వారాల పాటు ఓట్స్ ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గాయని తేలింది. రోజుకి 100 గ్రాములు ఓట్స్ ని తీసుకుని వాళ్లలో కొలెస్ట్రాల్ తగ్గిందని బాడీ వెయిట్ కూడా తగ్గిందని తెలుస్తోంది. కాబట్టి ఓట్స్ ని మీ డైట్ లో తీసుకోవడం కూడా మంచిదే. దీని వల్ల ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.

బ్లూ బెర్రీస్: ఓట్స్ తో పాటు బ్లూ బెర్రీస్స్ తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఓట్స్ తో బ్లూ బెర్రీస్ తీసుకోండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం మంచిది. ఇలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలానే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)