మా పాలనను గుర్తించండి...లేదంటే....!

Telugu Lo Computer
0


తమ పాలనను అధికారికంగా గుర్తించాలని తాలిబన్లు అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. వివిధ దేశాల్లో స్తంభించిపోయిన నిధులను విడుదల చేయాలని కోరారు. అఫ్గాన్‌ ఆస్తులపై ఆంక్షలు ఎత్తివేయలన్నారు. లేదంటే ఇది మున్ముందు అంతర్జాతీయ సమస్యగా పరిణమించే అవకాశం ఉందంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ హెచ్చరించే ప్రయత్నం చేశారు. చివరిసారి అమెరికా, తాలిబన్ల మధ్య సరైన దౌత్యసంబంధాలు లేకపోవడం వల్లే యుద్ధం తలెత్తిందని ముజాహిద్‌ చెప్పుకొచ్చారు. చర్చలు, రాజకీయ సయోధ్య వల్ల అప్పుడు సమస్యలు పరిష్కారమై ఉండేవని వ్యాఖ్యానించారు. తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడం అఫ్గాన్‌ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో పౌరప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఏ దేశమూ అధికారికంగా వారి పాలనను గుర్తించలేదు. పైగా ఆయా దేశాల్లో ఉన్న అఫ్గాన్‌ ఆస్తులు, నిధులను స్తంభింప జేశారు. ఇప్పటికే అఫ్గాన్‌ ప్రజలు తీవ్ర కరవుకాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆర్థిక, మానవతా సంక్షోభం నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమస్య మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో చేసేది లేక తాలిబన్లు గుర్తింపు కోసం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)