ఈ రోజు కూడా.....!

Telugu Lo Computer
0


దేశంలో ఇంధన ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. శుక్రవారం  లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై గరిష్ఠంగా 35 పైసల చొప్పున ఎగబాకాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.89, డీజిల్‌ రూ.95.62కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.112.78, రూ.103.63గా ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటేయగా, డీజిల్‌ ధర సైతం మరికొన్ని రోజుల్లో ఆ మార్క్‌ను దాటేయనుంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.118.54గా నమోదైంది. ఇక్కడ డీజిల్‌ ధర రూ.109.41 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 84 డాలర్లుగా నమోదవుతోంది. సెప్టెంబరు 27 తర్వాత పెట్రోల్‌ ధరను 19 సార్లు పెంచారు. దీంతో లీటర్‌ ధర రూ.5.7 మేర పెరిగింది. సెప్టెంబరు 24 తర్వాత డీజిల్‌ ధరను 22 సార్లు సవరించారు. దీంతో ధర రూ.7 మేర పెరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)