మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.....!

Telugu Lo Computer
0

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని, అతిథిగానే వచ్చాను, అతిథిగానే ఉంటానని ఆయన చెప్పారు.ఓటమిని జీర్ణించుకున్నాను కాబట్టే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు బిడ్డను ఎన్నుకున్నారని, తెలుగు వ్యక్తే 'మా' అధ్యక్షునిగా ఉండాలని సభ్యులు కోరుకున్నారని ఆయన చెప్పారు. "నేను తెలుగు బిడ్డను కాదన్నారు కాబట్టే రాజీనామా చేశాను. ఇలాంటి ఐడియాలజీ ఉన్న అసోసియేషన్‌లో ఉండి పని చేయలేను, అవసరమైతే బయట ఉండి పని చేస్తాను. రాజకీయ సపోర్ట్ అవసరం లేదనుకున్నాను, కానీ అవసరం ఉందని నిరూపించారు. దీంతో అయిపోలేదు, అలా మొదలయ్యింది కాదు, ఇప్పుడే మొదలయ్యింది" అని ఆయన అన్నారు. అయితే, తెలుగు సినిమాల్లో నటిస్తుంటానని, వారితో కలిసి పని చేస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా సభ్యత్వం లేకపోతే నన్ను నటించేందుకు అనుమతించరా? అని ఆయన ప్రశ్నించారు. 'మా' తో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉందని 'మా' ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన అన్నారు. ప్రాంతీయతగానే ఎన్నికలు జరిగాయి. ఇలాంటి (ప్రాంతీయత) ఎజెండాతో ఉన్నఅసోసియేషన్‌లో నేను ఉండలేను. అబద్దాలు చెప్పలేను. అలాంటి వాతావరణంలో ఉండలేను అని ప్రకాశ్ రాజ్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)