గదిని ఊడ్చిన ప్రియాంక

Telugu Lo Computer
0

 

లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను యూపీ పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్న విషయం తెలిసిందే. 'నేనేం నేరం చేయడం లేదు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నాను. కానీ, మీరు నన్ను ఆపుతున్నారు. ఏ కారణంతో? అయినా.. అరెస్టు చేసేందుకు వారెంట్ అవసరం' అంటూ ప్రియాంక గాంధీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు ప్రియాంకను అరెస్టు చేసిన పోలీసులు సీతాపుర్‌లోని రాష్ట్ర అతిథి గృహానికి తరలించారు. ఈ క్రమంలో ఆమె తనను నిర్బంధించిన గదిలోనూ నిరసన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ గదిని చీపురుతో శుభ్రం చేస్తున్నట్లు కనిపించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 'ఈ నిరసన.. అన్నదాతల హక్కుల సాధన కోసం. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం. భాజపా ప్రభుత్వం ఈ హక్కులను అణచివేయలేదు. గాంధీ మార్గంలో ఈ పోరాటం కొనసాగుతుంది' అని రాసుకొచ్చింది. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ప్రియాంక గాంధీ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పార్టీ ఆరోపించింది. రాహుల్‌ గాంధీ సైతం ప్రియాంక అరెస్టుపై స్పందిస్తూ.. 'ప్రియాంక. నాకు తెలుసు.. నువ్వు వెనకడుగేయవని. నీ ధైర్యానికి వారు భయపడిపోయారు. న్యాయం కోసం జరుగుతున్న ఈ అహింసా పోరాటంలో.. మేము అన్నదాతలను గెలిపించి తీరుతాం' అని ట్వీట్‌ చేశారు. లఖింపుర్‌ ఖేరికి వెళ్లేందుకు సిద్ధమైన ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ తదితరులనూ పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)