గుంటూరు శేషేంద్రశర్మ

Telugu Lo Computer
3


జనన బాహుళ్యంలో శేషేంద్ర గా సుపరిచుతులైన గుంటూరు శేషేంద్రశర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు. ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి."నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ. పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొక శైలీ నిర్మాత. శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, నాగరాజపాడులో జన్మించారు. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాక, మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ పొందారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మునిసిపల్‌ కమిషనరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి మే 31న అంబర్‌పేట శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం వందనం సమర్పించారు. శేషేంద్ర కుమారుడు సాత్యకి చితికి నిప్పటించారు.శేషేంద్రకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ముత్యాలముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశారు. ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాల కోసం రాసిన ఒకే ఒక్క పాట.

Post a Comment

3Comments

  1. Visionary Poet of the Millennium
    An Indian poet Prophet
    Seshendra Sharma
    October 20th, 1927 - May 30th, 2007
    http://seshendrasharma.weebly.com/
    https://seshen.tributes.in/
    https://www.facebook.com/GunturuSeshendraSharma/
    eBooks :http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma
    Seshendra Sharma is one of the most outstanding minds of modern Asia. He is the foremost of the Telugu poets today who has turned poetry to the gigantic strides of human history and embellished literature with the thrills and triumphs of the 20th century. A revolutionary poet who spurned the pedestrian and pedantic poetry equally, a brilliant critic and a scholar of Sanskrit, this versatile poet has breathed a new vision of modernity to his vernacular.Such minds place Telugu on the world map of intellectualism. Readers conversant with names like Paul Valery, Gauguin, and Dag Hammarskjold will have to add the name of Seshendra Sharma the writer from India to that dynasty of intellectuals.

    Rivers and poets
    Are veins and arteries
    Of a country.
    Rivers flow like poems
    For animals, for birds
    And for human beings-
    The dreams that rivers dream
    Bear fruit in the fields
    The dreams that poets dream
    Bear fruit in the people-
    * * * * * *
    The sunshine of my thought fell on the word
    And its long shadow fell upon the century
    Sun was playing with the early morning flowers
    Time was frightened at the sight of the martyr-
    - Seshendra Sharma
    B.A: Andhra Christian College: Guntur: A.P: India
    B.L : Madras University: Madras
    Deputy Municipal Commissioner (37 Years)
    Dept of Municipal Administration, Government of Andhra Pradesh
    Parents: G.Subrahmanyam (Father) ,Ammayamma (Mother)
    Siblings: Anasuya,Devasena (Sisters),Rajasekharam(Younger brother)
    Wife: Mrs.Janaki Sharma
    Children: Vasundhara , Revathi (Daughters),
    Vanamaali ,Saatyaki (Sons)

    Seshendra Sharma better known as Seshendra is
    a colossus of Modern Indian poetry.
    His literature is a unique blend of the best of poetry and poetics.
    Diversity and depth of his literary interests and his works
    are perhaps hitherto unknown in Indian literature.
    From poetry to poetics, from Mantra Sastra to Marxist Politics his writings bear an unnerving pprint of his rare genius.
    His scholar ship and command over Sanskrit , English and Telugu Languages has facilitated his emergence as a towering personality of comparative literature in the 20th century world literature.
    T.S.Eliot ,ArchbaldMacleish and Seshendra Sharma are trinity of world poetry and Poetics.
    His sense of dedication to the genre of art he chooses to express himself and
    the determination to reach the depths of subject he undertakes to explore
    place him in the galaxy of world poets / world intellectuals.
    Seshendra’seBooks :http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma
    Seshendra Sharma’s Writings Copyright © Saatyaki S/o Seshendra Sharma
    Contact :saatyaki@gmail.com+919441070985+917702964402

    ReplyDelete
  2. కవిర్విశ్వో మహాతేజా

    గుంటూరు శేషేంద్ర శర్మ

    Seshendra : Visionary Poet of the Millennium
    seshendrasharma.weebly.com

    సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
    విమర్శకుడు : కవి


    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనాస్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........

    - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)

    * * *

    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.

    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,

    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.

    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోమున్సిపల్‌ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.

    నాదేశం - నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ ప్రధాన రచనలు.

    కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,

    ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొకశైలీనిర్మాత.

    - యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
    అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999

    Seshendra : Visionary Poet of the Millennium
    seshendrasharma.weebly.com

    ReplyDelete
    Replies
    1. వందేళ్ల తెలుగు సాహిత్యం నుంచి ఏర్చి కూర్చిన కవితలు, విశ్లేషణ వ్యాసాలు , ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచిన వెయ్యి పేజీల గ్రంథం "కవన గర్బరాలు".. అమెజాన్ లో అందుబాటులో ఉంది. వెల ఆరువందల రూపాయలు.. సంపాదకులు చేపూరి సుబ్బారావు వి.కె.ప్రేంచంద్
      https://kavanagarbaralu-telugubook.blogspot.com/2024/01/blog-post.html

      Delete
Post a Comment