విమానయాన రంగం జపాన్‌ కొత్తపుంతలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 20 October 2021

విమానయాన రంగం జపాన్‌ కొత్తపుంతలు

 

జపాన్‌ లో తిరిగి విమాన సేవలకు అనుమతులు రావడంతో అక్కడి ప్రజలు విహారయాత్రలకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారట. దీంతో విమానయానరంగానికి, పర్యటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అక్కడి పీచ్‌ ఏవియేషన్‌ సంస్థ.. 'మిస్టరీ డెస్టినేషన్‌' పేరుతో వినూత్న ప్రయత్నం చేస్తోంది. కొంతమందికి విహాయరయాత్రకు వెళ్లాలని ఉన్నా.. ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారే లక్ష్యంగా సరికొత్త టికెట్‌ వెండింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేసింది. పలు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న ఈ వెండింగ్‌ మిషన్‌లో చిన్న చిన్న ప్లాస్టిక్‌ బాల్స్‌ ఉంటాయి. ఒక్కో బాల్‌ లోపల విహారయాత్రలకు అనువుగా ఉండే సప్పొరో, సెండాయ్‌, నగోయా, ఫుకవొకా, కగోషిమా సహా వివిధ ప్రాంతాల పేరుతో టికెట్స్‌ పెట్టారు. ఒక్క బాల్‌ ధర 5వేల యెన్లు(రూ.3,285). పర్యాటకులు ఈ బాల్‌ను కొనుగోలు చేసి దాన్ని ఓపెన్‌ చేస్తే అందులో సందర్శక ప్రాంతం పేరుతో టికెట్‌ కనిపిస్తుంది. అప్పటికప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లే విమానం ఎక్కేయడమే తరువాయి. టికెట్‌తోపాటు కొన్ని రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. ఈ ఆఫర్‌ను దేశీయ పర్యటనను ప్రోత్సహించడంలో భాగంగానే అందిస్తున్నామని పీచ్‌ ఏవియేషన్‌ సంస్థ చెబుతోంది.

No comments:

Post a Comment