శేష వస్త్రం ధరించవచ్చా ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 21 September 2021

శేష వస్త్రం ధరించవచ్చా ?


అమ్మవారి చీరలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి చీర ధరించిన తరువాత, ఆ పవిత్రతను కాపాడటం కోసం తప్పని సరిగా కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి. తిథి - వర్జ్యం చూసుకుని 'శుక్రవారం' రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి. ఈ చీరను ధరించినంత సేపు ప్రశాంతంగా, పవిత్రంగా వుండాలి.  మంచి ఆలోచనలు చేస్తూ ... మంచి విషయాలను గురించి మాత్రమే మాట్లాడవలసి వుంటుంది. రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించ కూడదు, ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది. పుణ్యక్షేత్రాల్లోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా, మారుమూల గ్రామంలోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా పవిత్రత విషయంలో ఒకే విధమైన నియమాలను పాటించవలసి వుంటుంది.

No comments:

Post a Comment

Post Top Ad