ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

Telugu Lo Computer
0

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం మంచి నీళ్ళపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తుఫాన్ తీవ్రతరం కావడంతో సముద్రంలో అలజడుల తాటికి బోటుపై నుండి మత్స్యకారులు బోల్తాపడ్డారు. అధికారులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు వంక నాయకన్న, వంక చిరంజీవి, పిట్ట హేమారావు, కొండ బీమారావు, ఎలుకల పాపారావు, బుంగ మోహన్ రావులు గడిచిన రెండు రోజులు క్రితం కొత్త బోట్ కొనేందుకు ఒరిస్సా వెళ్లారు. అక్కడ బోట్ కొనుక్కొని సముద్రమార్గం ద్వారా మంచినీళ్ళపేట వస్తుండగా ఈరోజు మధ్యాహ్నం అక్కుపల్లి సముద్ర ప్రాంత సరిహద్దుల్లో తుఫాన్ కారణంగా తీవ్ర అలజడులకు లోనై బోట్ అదుపుతప్పడంతో ఐదుగురు బోట్ నుండి సముద్రంలోకి పడిపోయారు. ఈ విషయాన్ని అదే బోటులో ఉన్న మరొక వ్యక్తి పిట్ట హేమారావు జరిగిన సంఘటనను గ్రామస్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం అతని ఆచూకీ కూడా తెలియడం లేదని ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ ఆయన స్వీకరించడం లేదని ఆయన ఆచూకీ తెలియాల్సి ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)