త్వరలో కార్యాలయాల నుండి పని

Telugu Lo Computer
0

 

 

ఐటీ కంపెనీలు ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంటి వద్ద నుంచే పని (వర్క్‌ ఫ్రం హోమ్‌) విధానానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం కన్పిస్తోంది. కొవిడ్‌-19 టీకాలు వేసే కార్యక్రమం వేగవంతం అవ్వడం, కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉంటుండటం ఇందుకు కారణాలు. ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తన 5,00,000 మంది ఉద్యోగుల్లో 70-80% మందిని కార్యాలయాలకు రప్పించే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ రాజేశ్‌ గోపీనాధన్‌ తెలిపినట్లు ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది. అయితే కొవిడ్‌-19 మూడో విడత వ్యాప్తి పరిణామాలను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ టీసీఎస్‌ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, మిగతా ఐటీ కంపెనీలు కూడా దీనిని అనుసరించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 మార్చిలో కొవిడ్‌-19 ఉద్ధృతి ప్రారంభమై, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో, ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేసేలా ఐటీ కంపెనీలు అవకాశం కల్పించాయి. ఏడాదిన్నరగా అత్యధిక ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సుమారు 195 బి.యన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన టీసీఎస్‌, ఈ మొత్తాన్ని మరింతగా పెంచుకునేందుకు కొత్త కంపెనీలను కొనుగోలు చేసే ప్రణాళికలేవీ లేవని, దానికి బదులు సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తామని సీఈఓ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)