ఇల్లు కట్టివ్వడమే నా లక్ష్యం : బండ్ల

Telugu Lo Computer
0


మా ఎన్నికల్లో పోటీచేస్తున్న నటుడు బండ్ల గణేష్ జనరల్ సెక్రెటరీ పదవికి కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ, మా కోసం కొంతమంది బిల్డింగ్ కడతామంటున్నారు అది జరిగే పనికాదని అన్నారు. పేద కళాకారులకు ఇల్లు కట్టివ్వడమే తన లక్ష్యమని బండ్ల వ్యాఖ్యానించారు. అంతే కాకుండా జనరల్ సెక్రెటరీ పదవికి తాను గెలవడం కాయమని దీమా వ్యక్తం చేశారు. తన వెనక చాలా మంది ఉన్నారని..చాలా మంది ఆశీర్వదిస్తున్నారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూబ్లిహిల్స్ మా బిల్డింగ్ అంటే అయ్యే పనికాదని కాబట్టి కోకాపేటలో భూమి తీసుకుని వంద మంది పేద కళాకారులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని బండ్ల గణేష్ అన్నారు. ఫండ్స్ కోసం ఎక్కడికో విదేశాలకు వెళతారట..అంత అవసరమా అంటూ బండ్ల వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్..మంచు విష్ణు ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా నాకు ప్రెసిడెంటే అని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. అంతే కాకుండా 11వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడతానని బండ్ల గణేష్ తెలిపారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)