మార్పు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 September 2021

మార్పు!


గ్రద్ద జీవితం!  గ్రద్ద అనగానే మనకు ఎప్పుడూ  కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను భయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు. ఇంకా గ్రద్దలు మనుషుల కళేబరాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం. కానీ గ్రద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?

 గ్రద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గ్రద్దే.  అయితే గ్రద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు.  ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు.  ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి మరణించడం, లేదా బాధాకరమైన సరే తనను తాను మార్చుకోవడం. ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది.  అలాగే, గ్రద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గ్రద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుందో ఒక్కసారి చూద్దాం!

గ్రద్దకు ఈ మార్పు చాలా బాధాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గ్రద్ద తనకు అందుబాటులో వున్న ఒక ఎతైన  కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడకి వెళ్ళి పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాధ కలిగినా నెమ్మదిగా వొలిచేసుకుంటుంది. ఇలా వదిలించుకున్న ముక్కు కాస్తా మళ్ళీ కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది.  ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది.ఇలా 5నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది. ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గ్రద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది. ఇలానే ప్రతీ మానవునికి కూడా జీవించాలనే ఉంటుంది. కాని జీవితాన్నే మార్చే ధ్యానసాధన మాత్రం 1 గంట చేయలేము. జీవితం మాత్రం కావాలి. ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయస్సు పెంచుకుంది. పాత సామెత ఒకటి ఉంది…కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి అమ్మాయి బొద్దుగా ఉండాలి అని..! అలానే మనం ధ్యానం చేయము కాని ఆరోగ్యం, ఆనందం మనకు కావాలి....! ఎలా వస్తుంది... ?     ఎక్కడ నుంచి వస్తుంది....? ఒక పక్షి    సాధన చేత మరో పునర్జన్మ తెచ్చుకున్నట్టుగా .... మనమూ కఠోర  ధ్యాన సాధనచేద్జాం... మానవులుగా  ఉన్న మనం మాధవులు గా మారుదాం! ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదాం..!

No comments:

Post a Comment