తిరుపతి ఎయిర్‌పోర్టు ప్రై'వేటు'

Telugu Lo Computer
0


త్వరలో తిరుపతి ఎయిర్‌పోర్టు ప్రైవేట్‌పరం కానుంది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్‌ పోర్టు కూడా ఒకటి. ఇదేగనుక జరిగితే తిరుచ్చి ఎయిర్‌ పోర్టు పరిధిలోకి తిరుపతి విమానాశ్రయం రానుంది. తిరుమల దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తే తప్పక లాభాల బాటలో నడిచే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ప్రైవేట్‌ జెండా ఊపడం విమర్శలకు తావిస్తోంది. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ రూ.22 కోట్లకు పైగా లాభాల్లో ఉంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రూ.35 కోట్ల నష్టాల్లో ఉంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్‌ పోర్ట్‌ కూడా తిరుపతే. కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గటం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)